News February 9, 2025
బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాపట్ల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బాపట్ల పట్టణంలోని ఓ బార్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2026
చెన్నైకి ఆరెంజ్ ఆర్మీ షాకిస్తుందా?

ఐపీఎల్‌లో CSKపై SRH రికార్డు పేలవంగా ఉంది. ఇరు జట్లు 22 సార్లు తలపడగా ఆరెంజ్ ఆర్మీ 7, చెన్నై 15 సార్లు గెలిచాయి. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక స్కోర్ రికార్డు సీఎస్కే పేరిట (223/3) ఉంది. SRH 2024లో అత్యధికంగా 192 రన్స్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో 2018 నుంచి చెన్నై గెలవలేదు. ఈసారి CSKతో పోలిస్తే సన్‌రైజర్స్ బలంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 18, 2026
మదనపల్లె: 25న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఈనెల 25న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ శనివారం పేర్కొన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి(SBTET), మంగళగిరి కార్యదర్శి ఆదేశాలతో POLYCET-2026 హాల్ టికెట్లు 18న ఉదయం11కు డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచబడతాయన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 పొందాలన్నారు.
News April 18, 2026
TU: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. 151 మంది గైర్హాజరు

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రారంభమై ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. శనివారం 29 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన 1, 6వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 5,409 మంది విద్యార్థులకు 5,258 మంది విద్యార్థులు హాజరు కాగా 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.


