News March 13, 2025

బాపట్ల: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పక్కా గృహాల నిర్మాణం, స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు.

Similar News

News April 19, 2026

రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

image

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.

News April 19, 2026

సూర్యాపేటలో 163 BNSS అమలు: ఎస్పీ నరసింహ

image

సూర్యాపేట జిల్లాలో రేపటి నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు ఉంటాయని, గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు. పరీక్ష సమయాల్లో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

News April 19, 2026

లైసెన్స్‌ సర్వేయర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: జేసీ

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 235 మంది లైసెన్స్‌ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ నియామక ప్రక్రియను జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.