News March 5, 2025

బాపట్ల: ఉమెన్స్ డే ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఈ నెల 8వ తేదీన జరగనున్న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ జె.వెంకట మురళీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమం విజయవంతం చెయ్యాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ పాల్గొన్నారు.

Similar News

News December 11, 2025

హైదరాబాద్ జట్టును ఓడించిన నల్గొండ టీం

image

వనపర్తిలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ బాలుర పోటీలలో నల్గొండ జిల్లా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో హైదరాబాద్ జట్టును 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో నల్గొండ జట్టు మహబూబ్‌నగర్ జట్టుతో తలపడనుంది. జట్టు ప్రదర్శన పట్ల కార్యదర్శి విమల, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు.

News December 11, 2025

తూ.గో: ఎంత కష్టం.. ప్రజాప్రతినిధులకు శాలరీలు లేవట!

image

ఉమ్మడి తూర్పుగోదావరిలో 1072 పంచాయతీలు, 62 జడ్పీటీసీ, 62 ఎంపీపీలు, 970 పైగా ఎంపీటీసీలు ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేసే వీరికి రెండేళ్ల నుంచి ప్రభుత్వం గౌరవ వేతనాలివ్వడం లేదు. జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.6 వేలు, ఎంపీటీసీ, సర్పంచులకు రూ.3 వేలు వంతున వేతనాలివ్వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇవి ఆగిపోయాయి. దీంతో ప్రజాప్రతినిధులు తమ వేతనాల కోసం ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

News December 11, 2025

అర్ష్‌దీప్ చెత్త బౌలింగ్.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు

image

సౌతాఫ్రికాపై టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ చెత్త బౌలింగ్‌ చేశారు. ఒకే ఓవర్లో ఏకంగా 7 వైడ్లు వేశారు. తొలి బంతికే డికాక్ సిక్స్ కొట్టగా.. అనంతరం 7 బంతుల్లో 6 వైడ్లు వేశారు. తర్వాత 1, 2, 1 రన్స్ ఇచ్చారు. ఆపై మళ్లీ 7వ వైడ్ వేశారు. ఆఖరి బంతికి డికాక్ సింగిల్ తీశారు. ఈ ఓవర్లో ఎక్స్‌ట్రాలతో కలిపి మొత్తం 18 రన్స్ వచ్చాయి. అర్ష్‌దీప్ బౌలింగ్‌కు హెడ్ కోచ్ గంభీర్ కూడా తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపించారు.