News November 19, 2025
బాపట్ల: ‘కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత’

పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులు అనుమతించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ చెప్పారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవులో 14.960 హెక్టార్ల ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు.
Similar News
News January 14, 2026
మేడ్చల్ విద్యార్థులకు గమనిక.. 22న ఎంట్రన్స్ టెస్ట్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 22న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. 5-10 తరగతుల వరకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈనెల 21లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. www.tgswreis.telangana.gov.inలో అప్లై చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను 040 23391598 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
News January 14, 2026
అన్నమయ్య: భార్య మరణవార్త విని భర్త మృతి

‘ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి’ 60 ఏళ్ల కిందట వివాహ సమయంలో ఆ దంపతులు చేసిన ప్రమాణం ముందు మృత్యువు తలవంచింది. బి.కొత్తకోట (M) అమరనారాయణ పురానికి చెందిన అంజమ్మ(85),శ్రీరాములు(90)దంపతులు. వృద్ధాప్యం వరకూ అన్యోన్యంగా ఉన్నారు. మంగళవారం ఉదయం అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మృరణవార్త విన్న శ్రీరాములు కూడా కుప్పకూలి మృతి చెందాడు.
News January 14, 2026
ఉంగుటూరులో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉంగుటూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. ఉంగుటూరు నుంచి స్వగ్రామమైన నాచుగుంట పాటిమీదకు వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా.. తాడేపల్లిగూడెం వైపు నుంచి విజయవాడ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


