News March 11, 2025

బాపట్ల: చంద్రయ్య హత్య.. ఆరోజు ఏం జరిగిందంటే..!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్దుర్తి TDP కార్యకర్త చంద్రయ్య హత్య కేసును CIDకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మాచర్ల TDP ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. చంద్రయ్య స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను నడిరోడ్డుపై పీక కోసి హత్య చేశారు. ఈ కేసులో ఎంపీపీ శివరామయ్య, కొడుకు ఆదినారాయణ, అల్లుడు అంజి సహా నలుగురు నిందితులుగా ఉన్నారు. చనిపోతూ జై చంద్రబాబు అన్నట్లు సమాచారం.

Similar News

News January 13, 2026

కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా..! రెవెన్యూ డివిజన్..?

image

విభజనపై జిల్లా వాసుల్లో, రాజకీయ నేతల్లో కలకలం మొదలైంది. జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రాగా అధికారికంగా ప్రకటన చేయలేదు. కొడంగల్ విషయంలో ఏదైనా కొత్త నిర్ణయం జరగవచ్చని చెబుతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కొంతకాలంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా లేదా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చసాగుతోంది.

News January 13, 2026

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ (<>BARC)<<>> 12 నర్సు పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్, డిప్లొమా(నర్సింగ్ &మిడ్‌వైఫరీ/ BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. జీతం నెలకు రూ.55వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in

News January 13, 2026

‘జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

image

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ <<18824314>>ఆరోపణల్లో<<>> నిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్‌ ఆంఖోలర్‌ అన్నారు. ‘ఆమెకు జూనియర్ బాక్సర్‌తో వివాహేతర సంబంధం ఉండేది. ఫ్యామిలీ సర్దిచెప్పినా మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకు నా దగ్గర వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్‌లు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుంది. అందుకే విడాకులు తీసుకుంది’ అని IANS ఇంటర్వ్యూలో చెప్పారు.