News February 27, 2025

బాపట్ల జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వేమూరు, రేపల్లె, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాలలకు గురువారం లోకల్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు లోకల్ హాలిడే ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి పాఠశాలలు నిర్వహించరాదని తెలిపారు.

Similar News

News March 25, 2025

పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

image

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

News March 25, 2025

ADB: అక్రెడిటేషన్ గడువు పొడగింపు

image

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.

News March 25, 2025

BSNL యూజర్లకు అలర్ట్

image

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!