News February 9, 2025
బాపట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త..!

బాపట్ల జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న బాపట్ల జిల్లాలో గరిష్ఠంగా 33.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News February 19, 2026
మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు అని ఢిల్లీ సమ్మిట్‌లో మోదీ అన్నారు. మనుషులు, టెక్ కలిసి పనిచేసే దశలోకి ప్రవేశిస్తున్నామన్నారు. ఈ విప్లవాన్ని శాసించేందుకు పెద్ద విజన్ అవసరమని పేర్కొన్నారు. ఈ జర్నీలో భారత్ కేవలం భాగంగానే కాకుండా ముందుండి నడిపిస్తోందన్నారు. ఈ కొత్త సాంకేతికత మనుషుల్ని ముడి పదార్థాలుగా మార్చే అవకాశం ఇవ్వొద్దన్నారు. ఏ టెక్నాలజీ అయినా కంట్రోల్‌లో ఉండాలంటూ AI నియంత్రణను ప్రస్తావించారు.
News February 19, 2026
కాజీపేట: శివాజీ జయంతి ఏర్పాట్లలో ఒకరు మృతి.. UPDATE

కాజీపేటలో <<19181822>>శివాజీ శోభాయాత్ర ఏర్పాట్లు<<>> చేస్తుండగా కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. దర్గా ప్రాంతానికి చెందిన పోతరబోయిన శివకుమార్, రోహిత్, దినేశ్ ఛత్రపతి శివాజీ జయంతి కోసం ఐరన్ పైపులతో ఏర్పాట్లు చేస్తున్నారు. అవి కరెంట్ వైర్లకు తగలడంతో శివకుమార్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. రోహిత్ చేతికి గాయాలవగా.. దినేష్ సురక్షితంగా బయటపడ్డాడని తెలిపారు.
News February 19, 2026
T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.


