News February 6, 2025
బాపట్ల జిల్లా మంత్రులకు CM ర్యాంకులు

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంక్, అనగాని సత్యప్రసాద్ 21 ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని CM సూచించారు.
Similar News
News January 25, 2026
రథసప్తమి.. తిరుమలలో పటిష్ఠ బందోబస్తు

తిరుమలలో శ్రీవారి రథసప్తమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, టీటీడీ సీవీ&ఎస్‌ఓ మురళీకృష్ణ కీలక ప్రాంతాలను పరిశీలించి బందోబస్తును సమీక్షించారు. భారీగా భక్తుల రాక నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పుష్కరిణి వద్ద అదనపు సిబ్బంది, జియో-ట్యాగింగ్ వంటి చర్యలు చేపట్టారు.
News January 25, 2026
సంగారెడ్డి: పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

సంగారెడ్డి జిల్లాలో వివిధ దాడుల్లో పట్టుబడిన అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఈ సరుకును “యథాతథం” పద్ధతిలో విక్రయించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బీవరేజెస్, డిస్టిలరీ సంస్థల నుండి సీల్డ్ కొటేషన్లను ఆహ్వానించారు. ఆసక్తి గల వారు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News January 25, 2026
ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్

WPL-2026లో ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేసింది. ఇవాళ జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు విఫలమైనా లారా(42*), రోడ్రిగ్స్(24), కాప్(19*) రాణించడంతో విజయం సొంతమైంది. ఈ గెలుపుతో DC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో ఆర్సీబీ(10P) ఉంది.


