News September 13, 2025
బాపట్ల జిల్లా SP తుషార్ డూడీ బదిలీ..!

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎస్పీలు, కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న తుషార్ డూడీని చిత్తూరుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఉమామహేశ్వర్‌ను నియమించారు.
Similar News
News December 8, 2025
KNR: ‘పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఏర్పాట్లు, భద్రత, సిబ్బంది సమన్వయం తదితర అంశాలను పరిశీలించారు. లోపాలున్న చోట వెంటనే సరిదిద్దాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News December 8, 2025
MHBD: తుది పోటీలో 468 సర్పంచ్ అభ్యర్థులు

MHBDజిల్లాలో మొదటి విడత మండలాలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి ఏకగ్రీవంతో పాటు, తుది పోటీలో ఉన్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మొదటి విడత మండలాలు గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, MHBD, నెల్లికుదురు మండలాల్లో 9 సర్పంచ్, 266 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 468 సర్పంచ్ అభ్యర్థులు, 2421మంది వార్డు సభ్యులు తుది పోటీలో ఉన్నారు. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనునున్నాయి.
News December 8, 2025
నేపాల్‌లో అతిపెద్ద అవినీతి కేసు.. ఫేక్ బిల్లులతో!

నేపాల్‌లో చైనా నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అవినీతి జరిగింది. దీనిని $216 మిలియన్లతో పూర్తి చేయగా ఇందులో $74M(రూ.600కోట్లు) అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. చైనా కాంట్రాక్టర్‌తో ఏవియేషన్ అధికారులు, మాజీ మంత్రులు(5) కుమ్మక్కై ఫేక్ బిల్లులతో ప్రాజెక్ట్ వ్యయాన్ని $74M పెంచారు. కాగా ఇలా ఫేక్ బిల్లులతో వ్యయాన్ని పెంచి ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారనే చర్చ జరుగుతోంది.


