News November 6, 2025

బాపట్ల: పరిహారాన్ని 24 గంటల్లో పంపిణీ చేయాలి

image

తుఫాను కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని 24 గంటల్లో పంపిణీ చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో 9,956 మందికి నగదు, సరుకులు ఇవ్వాలని, 13,074 మత్స్యకారులు, 8,260 చేనేతలకు పరిహారం చెల్లించాలన్నారు. పంట నష్టం సర్వేను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. 36,818 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Similar News

News January 20, 2026

పెద్దపల్లి: రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కల్పన తెలిపారు. 21న మొదటి సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఆయా జూనియర్ కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహిస్తారని, విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

News January 20, 2026

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: హనుమకొండ కలెక్టర్

image

గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులకు హసన్‌పర్తి ఈటీసీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. సర్పంచులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొంటూ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

News January 20, 2026

సిరిసిల్ల: ‘వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయి’

image

బీజేపీలో పదవులు వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున బీజేపీ కార్యాలయంపై మంగళవారం జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. సేవ చేసే వారికి మాత్రమే పట్టం కట్టే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. శంకర్, తిరుపతి, రాజు, హరీష తదితరులు పాల్గొన్నారు.