News August 11, 2025
బాపట్ల పీజీఆర్ఎస్‌లో 54 అర్జీలు: ఎస్పీ

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 54 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News March 15, 2026
గుడిపల్లి రిజర్వాయర్ సందర్శించిన మాజీ మంత్రి నాగం

NGKL జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను ఆదివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా.నాగం జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించి, సాగునీటి విడుదలపై ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
News March 15, 2026
నల్గొండ: ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఉమ్మడి NLG జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా MLA వేముల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి కర్తయ్య, కోశాధికారిగా ఇమామ్ కరీం ఎన్నికయ్యారు. 2030 వరకు నాలుగేళ్ల పాటు ఈ కమిటీ బాధ్యతల్లో కొనసాగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని MLA తెలిపారు.
News March 15, 2026
పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం

AP: TDP MP పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఘటనపై వివరణ కోరుతూ మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని, పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని CBN స్పష్టం చేశారు. నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని తేల్చిచెప్పారు.


