News May 7, 2025
బాపట్ల: పొంచి ఉన్న ప్రమాదాలు.. జాగ్రత్త!

వేసవి సెలవుల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, బావులు, నదులు, డ్యాముల పరివాహిక ప్రాంతాల్లో పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. జిల్లా అధికారులు స్పందించి ముందస్తు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి.
Similar News
News February 18, 2026
ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..

ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకొనే ఆహారాన్ని బట్టి బిడ్డ బరువు ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పిండం వెయిట్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవకాడో, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, పప్పులు, నాన్ వెజ్, నట్స్, సీడ్స్, చిలగడదుంప వంటివి ఆహారంలో చేర్చుకుంటే కడుపులోని బిడ్డ బరువు పెరగడానికి సాయపడతాయంటున్నారు.
News February 18, 2026
నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై ఇంటెలిజెన్స్ సమీక్ష

నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతపై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విజయవిహార్‌లో కీలక సమీక్ష నిర్వహించారు. డ్యామ్ పరిసరాల్లో భద్రతా బలగాల మోహరింపు, సీసీ కెమెరాల నిఘా బలోపేతం, సందర్శకుల నియంత్రణపై చర్చించారు. విద్యుత్ ఉత్పత్తి విభాగం భద్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఈఈ హీరాలాల్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 18, 2026
తల్లిదండ్రులకు కలెక్టర్ నాగరాణి కీలక సూచన.. ఏంటంటే?

విస్సాకోడేరు జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పౌష్టికాహారంపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే పిల్లలు పాఠశాలల్లోనే ఎందుకు భోజనం చేయాలో వారికి అర్థమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.


