News December 1, 2025

బాపట్ల: వీడియోలు చూపించి అత్యాచారంపై కేసు నమోదు

image

చీరాలకు చెందిన ఓ మహిళ తనను బెదిరించి అత్యాచారం చేశారని బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టౌన్ పోలీసులు న్యాయవాది తులసీరావు, టీడీపీ మహిళా కార్యకర్త రజని సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. వీడియోలు చూపించి బెదిరించి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు టౌన్ సీఐ రాంబాబు తెలిపారు.

Similar News

News February 9, 2026

రిజర్వేషన్ల లెక్కలతో పల్లెల్లో రాజకీయ హడావిడి

image

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో పాలకవర్గాల గడువు ముగియనుండటంతో మార్చి 9 లోగా ఓటర్ల జాబితా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 1,044 పంచాయతీల్లో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. రిజర్వేషన్ల కేటాయింపుపై పల్లెల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

News February 9, 2026

అమెరికా WC జట్టులో తెలుగు కుర్రాడు

image

T20WCలో USA తరఫున ఆడుతున్న ముక్కమల్ల సాయితేజ తెలుగు వ్యక్తే. సొంతూరు APలోని నంద్యాల(D) కలమలపురి. అతని పేరెంట్స్ నాగేశ్వర్‌రెడ్డి, లక్ష్మి అమెరికాలో స్థిరపడ్డారు. సాయితేజ అక్కడే జన్మించినప్పటికీ HYDలోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2022లో USA నేషనల్ టీమ్‌కు ఎంపికయ్యారు. 37 ODIలు, 19 T20Iలలో 1,896 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

News February 9, 2026

పాలమూరు: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

image

మీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తారా? తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6th క్లాస్‌తో పాటు 7-10 క్లాసుల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష. స్మార్ట్ క్లాసులు, ల్యాబ్స్, భోజనం, యూనిఫామ్స్ ఫ్రీ. కొత్తకోట, భూత్పూర్, తిమ్మాజీపేట, NRPT, అయిజ తదితర చోట్ల శాఖలు ఉన్నాయి. FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు tgms.telangana.gov.inను చూడండి.