News December 1, 2025
బాపట్ల MP గారు.. పార్లమెంటులో గట్టిగా గళం విప్పండి..!

బాపట్ల రైల్వేస్టేషన్‌లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ముందు వరకు ఆగే ఎక్స్‌ప్రెస్‌లు తర్వాత నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాలకు అవసరమైన రవాణా వ్యవస్థ కోసం వేచి చూస్తున్నారు. ఉప్పరపాలెం రహదారిలో ROB ఏర్పాటు, పర్యాటక కేంద్రం విస్తరిస్తున్న సమయంలో రవాణా మెరుగునకు పార్లమెంట్‌లో MP కృష్ణ ప్రసాద్ గళం విప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 9, 2026
పాలమూరు: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

మీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తారా? తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6th క్లాస్‌తో పాటు 7-10 క్లాసుల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష. స్మార్ట్ క్లాసులు, ల్యాబ్స్, భోజనం, యూనిఫామ్స్ ఫ్రీ. కొత్తకోట, భూత్పూర్, తిమ్మాజీపేట, NRPT, అయిజ తదితర చోట్ల శాఖలు ఉన్నాయి. FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు tgms.telangana.gov.inను చూడండి.
News February 9, 2026
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు

AP: దేశంలోని ప్రఖ్యాత క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయవాడ గుణదల మేరీమాత ఆలయంలో 102వ ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. FEB 11 వరకు జరిగే ఈ వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరుకానున్నారు. దీంతో అధికారులు RTC, రైల్వే స్టేషన్ల నుంచి ఆలయానికి బస్సులను ఏర్పాటుచేశారు. కాగా 1937 నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. వేళాంగిణీ మాత(TN) ఆలయం తర్వాత రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా గుణదల ప్రసిద్ధి.
News February 9, 2026
ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడితో మోదీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పని చేసిన సైనికుడు జయరాజ్ రాజారావును PM మోదీ కలిశారు. మలేషియాలో పర్యటనలో ఉన్న ఆయన కౌలాలంపూర్‌లో ఈ మేరకు భేటీ అయ్యారు. ‘రాజారావు జీవితం అపార ధైర్యం, త్యాగాలతో నిండింది. ఆయన అనుభవాలను వినడం స్ఫూర్తి కలిగించింది. భారతదేశ భవితవ్యాన్ని రూపొందించడంలో సాయపడిన INA సైనికులు, నేతాజీకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని మోదీ పేర్కొన్నారు.


