News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News January 20, 2026
పోలవరం: అయ్యో.. ఈ పాపం ఎవరిది?

పోలవరం జిల్లా చింతూరు మండలంలో సోమవారం అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లిదండ్రులు ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను కల్లేరు పంచాయతీ మధుగురు శివారున పొదల్లో పడేశారు. అటుగా వెళ్తున్న ఇద్దరు మహిళలకు కేకలు వినబడడంతో వెళ్లి చూడగా.. పొదల్లో ఆడ శిశువు ఉంది. వెంటనే ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీడీపీవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
News January 20, 2026
సంగారెడ్డి: నేడు జిల్లాలో మంత్రి దామోదర్ పర్యటన

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారని అధికారులు, పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News January 20, 2026
ఈ మాసంలో ‘ప్రతిరోజు పర్వదినమే’

ఆధ్యాత్మికపరంగా మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతిరోజును పర్వదినంగానే భావిస్తారు. సూర్యుడు, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. వసంత పంచమి, రథసప్తమి, మహా శివరాత్రి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు మాఘ మాసం ఎంతో అనువైనది. పెళ్లిళ్లు ఎక్కువగా మాఘ మాసంలోనే ఎందుకు జరుపుతారో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


