News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
జైలు నుంచి జోగి రమేశ్, రాము విడుదల

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన YCP నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 85రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారికి తంబళ్లపల్లి కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ‘జైలులో మమ్మల్ని ఇబ్బందిపెట్టారు. అక్రమ కేసులకు మేం భయపడం. రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకోండి. జగన్‌ను మళ్లీ CM చేసేదాకా కొదమసింహాల్లా పనిచేస్తాం’ అని విడుదల అనంతరం జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.
News January 23, 2026
ఆత్మకూరు: శిలాఫలకంపై సీఎం పేరు గల్లంతు.. మంత్రి ఆగ్రహం

పరమేశ్వర స్వామి చెరువు కట్ట అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. శిలాఫలకంపై మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు లేకపోవడంపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ దీనిపై వివరణ కోరారు.
News January 23, 2026
మంచిర్యాల: ఇరువర్గాలను రెచ్చగొట్టిన వ్యక్తికి రిమాండ్

ఇరువర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తిని పోలీసులు కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. భీమారం మండలం బూరుగుపల్లికి చెందిన రాజు కుమార్ నాయక్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వర్గాలపై అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నాడని ఎస్ఐ రాజేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.


