News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
డీజీపీ పెంపే లక్ష్యంగా స్వర్ణాంధ్ర@2047: కలెక్టర్

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (డీజీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని స్వర్ణాంధ్ర@2047 జిల్లా విజన్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ప్రతీ విభాగంలో కనీసం 15 శాతం పురోగతి సాధించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.
News January 13, 2026
సూర్యాపేట: ట్రాన్స్‌జెండర్లకు రూ.75 వేల సబ్సిడీ రుణాలు

సూర్యాపేట జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక పునరావాసం కోసం 100 శాతం సబ్సిడీతో రూ.75 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహరావు తెలిపారు. అర్హులైన వారు ఐడీ కార్డు, ఆదాయ పత్రాలతో ఈనెల 28లోపు కలెక్టరేట్‌లోని G-1 గదిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18-55 ఏళ్ల మధ్య ఉండి, గతంలో లబ్ధిపొందని వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
News January 13, 2026
2027 ఎన్నికల్లో UP సీఎం అభ్యర్థిగా ప్రియాంక?

INC ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ UP రాజకీయాల్లో మళ్లీ కేంద్రబిందువుగా మారారు. నిన్న ఆమె 54వ పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. BCలను ఆకర్షించేలా పరివర్తన్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని UPCC చేపట్టింది. దీంతో 2027 UP అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. ఆమె నేతృత్వంలో అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.


