News September 9, 2025

బాలల సంక్షేమ సమితి కార్యకలాపాలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లా బాలల సంక్షేమ సమితి కార్యకలాపాలను ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. సీడబ్ల్యూసీ ఏలూరు ముందు హాజరైన పిల్లల వివరాలు, ప్రస్తుత పరిస్థితి, కేసు వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా బాలల సంక్షేమ సమితి కార్యకలాపాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి నివేదిక అందించాలని చెప్పారు.

Similar News

News December 17, 2025

20న అనకాపల్లిలో సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు ఈనెల 20న అనకాపల్లిలో పర్యటించనున్నట్లు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు మంగళవారం తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గంలో నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర‌ప్రదేశ్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. అనకాపల్లి, కశింకోట మండలాల్లో ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తారని అన్నారు.

News December 17, 2025

ఓటరు ఐడీ లేకున్నా 18 కార్డులతో ఓటేయచ్చు: కలెక్టర్

image

ఓటరు ఐడీ లేకపోయినా, ఎన్నికల సంఘం అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ప్రజలు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డులు సహా 18 ఐడీలు చెల్లుబాటవుతాయని తెలిపారు. tsec.gov.inలో ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

News December 17, 2025

బుధ ప్రదోష పూజా విధానం

image

ప్రదోష పూజను సాయంత్రం చేయాలి. అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. ప్రదోష వేళలో పూజా గదిలో శివలింగాన్ని లేదా శివపార్వతుల చిత్రపటాన్ని పూజించాలి. శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, పూలు, పండ్లు సమర్పించడం తప్పనిసరి. ప్రశాంత మనస్సుతో ‘ఓం నమః శివాయ’ అని జపించాలి. శివ అష్టోత్తరం చదివి, హారతి ఇచ్చి, నైవేద్యం పంచి ఉపవాసం విరమించాలి. బుధ ప్రదోషం బుద్ధి, వ్యాపారంలో విజయాన్నిస్తుంది.