News August 12, 2025
బాలాయపల్లె: కన్నబిడ్డ పట్టించుకోలేదని ఫిర్యాదు

బాలాయపల్లి గ్రామానికి రావి సులోచనమ్మ(85) కన్నీటి కథ ఇది. తనను రెండో కుమారుడు రవికుమార్, కోడలు లక్ష్మీకామాక్షి పట్టించుకోవడం లేదని వాపోయింది. రూ.10 లక్షలు, 15 సవర్ల బంగారం, స్థిరాస్తులు తీసుకుని తనను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించింది. దిక్కుతోచని స్థితిలో చెట్ల నీడన, బంధువుల ఇళ్లలో తలదాచుకున్నట్లు చెప్పింది. ఈక్రమంలో తిరుపతి కలెక్టరేట్‌లో అధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది.
Similar News
News March 12, 2026
నెల్లూరు జిల్లాలో పెట్రోల్ పట్టడం లేదా…?

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతోంది. బుకింగ్ OTPలు రావడం లేదు. కావలిలో కొందరు పెట్రోల్, డీజిల్ రావడం లేదని బంకులు మూసేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి ఆరోపించారు. జేసీబీ, మైనింగ్ లారీలకు బ్లాక్ మార్కెట్లో డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మీ ఏరియాలోనూ పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.
News March 12, 2026
HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

HHF-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ఆనందిమా కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ AI కిట్‌తో BP, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడునూ నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. గర్భిణుల పాలిట AI వరంగా నలిచింది.
News March 12, 2026
త్వరలో మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి?

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవతో ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్ ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా ఇటీవల విజయ్-రష్మిక, అల్లు శిరీష్-నయనిక వివాహాలు జరగగా, త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యా రెడ్డి ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే.


