News August 12, 2025

బాలికపై హత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష

image

హిందూపురం రూరల్ మండలం తూముకుంటలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు గంగాధర్‌కు శిక్ష పడింది. అనంతపురం ఫోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. అలాగే రూ.10 వేల జరిమానా విధించిందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరగ్గా పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి 17 మంది సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో సోమవారం తీర్పు వెల్లడించారు.

Similar News

News March 13, 2026

టీజేఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా సత్యనారాయణ

image

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా రావుల సత్యనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.గౌరీ నియామకపత్రం విడుదల చేశారు. సత్యనారాయణ నేటి నుంచే బాధ్యతలు చేపట్టనున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రమణారావు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ తదితర రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

News March 13, 2026

RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

image

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.

News March 13, 2026

ఆసిఫాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ కొరత లేదు: కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో గృహ అవసరాల LPG సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ హరిత తెలిపారు. గ్యాస్ వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని, నిల్వలను ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు.