News September 10, 2025

బాలుడికి వరంగల్ పోలీసుల ఆర్థిక సాయం

image

డెంగి జ్వరంతో బాధపడుతున్న బాలుడికి చికిత్స నిమిత్తం WGL పోలీసులు ఆర్థిక సహాయం అందించారు. హసన్‌పర్తి మండలం జయగిరికి చెందిన రిత్విక్ అనే బాలుడు డెంగి బారిన పడటంతో, అతడి తల్లిదండ్రులు చికిత్సకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. SM ద్వారా ఈ విషయం తెలుసుకున్న WGL ఆర్ముడ్ రిజర్వ్ విభాగం పోలీసులు వెంటనే స్పందించి, రూ.28,416 ఆర్థిక సహాయాన్ని తల్లిదండ్రులకు అందజేశారు.

Similar News

News December 17, 2025

NLG: ‘యూరియా కట్టడికి ప్రభుత్వం చర్యలు’

image

యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా అందించడంతో పాటు యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నూతనంగా యూరియా బుకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో రైతులు యాప్‌లో ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈనెల 20 నుంచి ఈ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చేలా జిల్లా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది.

News December 17, 2025

@9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
★ వరంగల్: 22.26%
★ హనుమకొండ: 21.52%
★ ములుగు: 20.96%
★ భూపాలపల్లి: 26.11%
★ జనగాం: 22.51%
★ మహబూబాబాద్: 27.49%
➤ మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

News December 17, 2025

రూ.లక్ష రుణం పొందడానికి అర్హతలు ఏమిటి?

image

AP: కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.