News March 19, 2024
బాల్కొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదేపల్లి గ్రామ శివారులో కాసేపటి క్రితం రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 14, 2025
నిజామాబాద్: 1PM UPDATE 72.56 శాతం

రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 72.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది….
* ధర్పల్లి మండలంలో 68.30%,
* డిచ్‌పల్లి-62.68%
* ఇందల్వాయి-75.29%
* జక్రాన్‌పల్లి-72.80%
* మాక్లూర్-76.66%
* మోపాల్- 78.95%
* NZB రూరల్-80.47%
* సిరికొండ-73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 14, 2025
NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్‌లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
News December 14, 2025
NZB: 11 గంటల వరకు 49.13 శాతం పోలింగ్

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన నాలుగు గంటల్లో ఉదయం 11 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 49.13 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ధర్పల్లి మండలంలో 53.59%,
* డిచ్‌నపల్లి-35.36%
* ఇందల్వాయి-50.45%
* జక్రాన్‌పల్లి-55.16%
* మాక్లూర్-56.25%
* మోపాల్- 55.17%
* NZB రూరల్-60.28%
* సిరికొండ-38.49% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


