News March 5, 2025
బాసర గోదావరిలో పడి యువకుడి మృతి..UPDATE

బాసర గోదావరిలో పడి <<15656684>>యువకుడు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. బాసర మండలం బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్ గాలే మారుతి(34) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. తిరిగి వస్తూ బాసర గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు. మారుతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 21, 2025
కాళ్లు చచ్చుబడిన వ్యక్తికి AI సాయంతో తిరిగి నడక!

వెన్నెముక గాయంతో రెండేళ్లపాటు మంచం పట్టిన వ్యక్తిని చైనాలోని హువాషాన్ ఆస్పత్రి పరిశోధకులు తిరిగి నడిచేలా చేయగలిగారు. దీనికోసం వారు ఏఐని వాడుకోవడం విశేషం. ఏఐ సాయంతో తాము అభివృద్ధి చేసిన ‘ట్రిపుల్ ఇంటిగ్రేటెడ్ బ్రెయిన్ స్పైన్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ’ని వాడి మెదడుకు, వెన్నెముకకు మధ్య ఎలక్ట్రోడ్‌లను అమర్చి నరాల బైపాస్ సర్జరీ నిర్వహించామన్నారు. 24 గంటలకే అతడికి కాళ్లు నియంత్రణలోకి వచ్చాయని వివరించారు.
News March 21, 2025
LRS ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జనగామ కలెక్టర్

పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కోషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి LRS ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులందరికి ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకునేలా సిబ్బంది ప్రోత్సహించాలన్నారు.
News March 21, 2025
ఏలూరు: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. కృష్ణా(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.