News January 27, 2025
బిచ్కుంద: కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న డీసీపీఓ

బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చైతన్య కులకర్ణి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతులమీదుగా చైతన్య ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News February 9, 2025
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

భువనగిరి మండలం మన్నెవారిపంపుకు చెందిన గుండ్ల ఎల్లారెడ్డి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో గాయాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రుడిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా వృద్ధుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబీకుల అంగీకారంతో మృతుడి కళ్లను దానం చేశారు.
News February 9, 2025
అత్యాశ.. ఉన్నదీ పోయింది!

కేంద్రంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలన్న అత్యాశే ఆప్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 సార్లు ఢిల్లీ ప్రజలు అధికారం ఇవ్వడం, ఆ తర్వాత పంజాబ్‌లోనూ పాగా వేయడంతో చక్రం తిప్పాలని కేజ్రీవాల్ భావించారు. ‘ఇండియా’ కూటమి నుంచి దూరమై నేరుగా మోదీపైనే విమర్శలు చేస్తూ దేశప్రజల దృష్టిని ఆకర్షించాలని చూశారు. ఈక్రమంలోనే అవినీతి ఆరోపణల కేసులు, ఢిల్లీలో పాలన గాడి తప్పడంతో ప్రజలు ఓటుతో ఊడ్చేశారు.
News February 9, 2025
నల్గొండ కబడ్డీ ట్రోఫీ గెలుచుకున్న ఓల్డ్ సిటీ టీం

నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఓల్డ్ సిటీ జట్టు మొదటి బహుమతి గెలుచుకుంది. ముఖ్య అతిథిగా DSP శివరాం రెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేశారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.