News December 2, 2025
బిజినపల్లి: రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నేడే చివరి రోజు

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణకు మంగళవారం చివరి రోజు కావడంతో బిజినేపల్లి సహా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని 7 మండలాల పరిధిలో ఉన్న 151 గ్రామాలలో ఈ విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు ఈ ఎన్నికలను సవాల్‌గా స్వీకరించి ముందుకు సాగుతున్నారు.
Similar News
News February 18, 2026
వేములవాడ: ‘విప్’ ఉల్లంఘన సమంజసమేనా?: చల్మెడ

అసెంబ్లీలో ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న వ్యక్తి, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో విప్‌ను ఉల్లంఘించడం ఏ మేరకు సమంజసమని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. బుధవారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ.. ఛైర్మన్ ఎన్నిక కోసం తగిన బలం లేనప్పటికీ కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులను, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను ప్రలోభాలకు గురిచేసి తమ వైపుకు లాక్కోవడం సరికాదని అన్నారు.
News February 18, 2026
ప్రభుత్వ ఆఫీసులలో AC ఉష్ణోగ్రతపై పరిమితి

TG: ప్రభుత్వ ఆఫీసులలో ACలను కనిష్ఠంగా 25డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం పరిమితి విధించింది. ఇంధన పొదుపుతో పాటు బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఆఫీసులు, స్కీముల విద్యుత్ బిల్లులు కొండల్లా పేరుకుపోయాయి. కొన్నేళ్లుగా డిస్కమ్‌లకు వీటి నుంచి రావాల్సిన బకాయి ₹48వేల CR వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
News February 18, 2026
రాజమండ్రి కోర్టుకి బాంబు బెదిరింపు

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజమండ్రి, కరీంనగర్, అనంతపురం కోర్టులకు ఈ కాల్స్ రావడంతో పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి ముమ్మరంగా గాలించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు.


