News September 10, 2025

బిజ్వార్ విద్యార్థిని రాష్ట్రస్థాయికి ఎంపిక

image

నారాయణపేట జిల్లాలో జరిగిన కళా వాస్తవ్ జిల్లాస్థాయి పోటీల్లో బిజ్వార్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని టి.నాగవేణి సత్తా చాటింది. నాగవేణి 3డి క్రాఫ్ట్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగవేణిని, ఆమెకు శిక్షణ ఇచ్చిన మనోహర్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Similar News

News December 12, 2025

ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

News December 12, 2025

మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

image

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్‌రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News December 12, 2025

సంగారెడ్డి: అన్నా 14 నాడు పక్కా రావాలే… నీ ఓటు నాకే.

image

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్ చేసి “అన్నా, 14న తప్పకుండా రావాలె, నీ ఓటు నాకే” అంటూ కోరుతున్నారు. బస్సు ఛార్జీలు, ఇతర ఖర్చులు తామే చెల్లిస్తామని హామీ ఇస్తూ, ఓటర్లను తమ సొంతూళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.