News April 26, 2024
బిట్రగుంట: మెము రైళ్లు రద్దు పొడిగింపు

పలు మెము రైళ్లు రద్దు పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిట్రగుంట-విజయవాడరైలు 29 నుంచి మే 26 వరకు, విజయవాడ-బిట్రగుంట రైలు 29 నుంచి మే 26 వరకు రద్దు చేశారు. బిట్రగుంట-చెన్నై రైలు 29 నుంచి మే 3 వరకు, మే 6 నుంచి 10 వరకు, 13 నుంచి 17 వరకు, మే 20 నుంచి 24 వరకు రద్దు చేశారు.
Similar News
News April 12, 2026
నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.
News April 12, 2026
నెల్లూరులో MPపై పోలీస్ కేసు నమోదు

నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. ఈక్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి తదితరులపై కేసు నమోదైంది.