News November 7, 2025

బిహార్‌లో మరోసారి ఎన్డీయేదే విజయం: మోదీ

image

బిహార్‌లో నిన్న జరిగిన భారీ పోలింగ్ మరోసారి NDA ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలను ఇస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ కామెంట్లు చేశారు. జేడీయూ అబద్ధాల ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. ‘జంగిల్ రాజ్’ను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రానివ్వద్దనే దృఢ సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ నమోదైంది.

Similar News

News January 19, 2026

హుస్నాబాద్: అదుపుతప్పిన బైక్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తండాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బర్మావత్ మనోహర్(27) బైక్ అదుపుతప్పి కరెంటు పోల్‌ను ఢీకొని మృతిచెందాడు. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన మనోహర్ హుస్నాబాద్-కరీంనగర్ మార్గంలో సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. 108 సిబ్బంది ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

News January 19, 2026

బిచ్చగాడి ఆస్తుల చిట్టా.. దెబ్బకు ఆఫీసర్లే షాకయ్యారు!

image

MPలోని ఇండోర్‌లో అధికారులకు షాకిచ్చాడో బిచ్చగాడు. బెగ్గర్లు లేని సిటీగా మార్చాలని డ్రైవ్‌ నిర్వహిస్తుండగా సరాఫా బజార్‌లో మంగీలాల్ అనే వికలాంగుడు కనిపించాడు. ఆరా తీయగా అతడి ఆస్తుల చిట్టా బయటపడింది. 3 ఇళ్లు, 3 ఆటోలు, ఓ కారు ఉన్నాయి. ఆటోలను అద్దెకు తిప్పుతుండగా, కారు కోసం ప్రత్యేకంగా డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. రోజుకు ₹500-1000 భిక్షాటనతో సంపాదిస్తున్నాడు. బంగారు వ్యాపారులకు అప్పు కూడా ఇస్తాడట.

News January 19, 2026

కవిత కొత్త పార్టీకి సన్నాహాలు.. స్ట్రాటజిస్ట్‌గా పీకే

image

TG: జాగృతి చీఫ్ కవిత ఉగాది వేళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆమె పార్టీ కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు. ఇటీవల 5 రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసి కొత్త పార్టీపై కవితతో చర్చలు జరిపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లోని ఇద్దరు కీలక నేతలతో కూడా పీకే మాట్లాడినట్లు తెలుస్తోంది.