News May 1, 2024
బీఆర్ఎస్‌ని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం: భట్టి

గత ఎన్నికలో అప్రజాస్వామిక బీఆర్ఎస్ పార్టీని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క అన్నారు. మధిరలో జరిగిన పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు మాసాల్లోనే తాము చెప్పిన గ్యారంటీలను అమలు చేసి చూపించామన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం: వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

ఖమ్మం జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ నిశితంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని పోలింగ్ సరళిని వీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటింగ్ విధానంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.
News December 17, 2025
11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 17, 2025
ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.


