News April 27, 2024
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ ట్వీట్

BRS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘రెపరెపలాడే గులాబీ పతాకం.. తెలంగాణ ఎగరేసిన జయ కేతనం. మనమే తెలంగాణ దళం. మనమే తెలంగాణ గళం. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం..బలగం. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు.. మీ శ్రమకు.. మీ కృషికి.. సదా సలాం..! BRS కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
నిప్పుల కొలిమిలా కరీంనగర్ జిల్లా!

KNR జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గురువారం జిల్లావ్యాప్తంగా ఎండలు ముదిరి, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. మానకొండూరు మండలం ఈదుల గట్టపల్లిలో అత్యధికంగా 44.1°C ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట, తిమ్మాపూర్ మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైగా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్ మధ్యలోనే వడగాల్పులు మొదలవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 16, 2026
కరీంనగర్ : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు ఘన వీడ్కోలు

కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ బదిలీపై సిద్దిపేటకు వెళుతున్న సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. లక్ష్మీ కిరణ్ ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని రెవెన్యూ సమస్యల పరిష్కారంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. వరి కొనుగోలు నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెను సన్మానించారు.
News April 15, 2026
KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.


