News November 19, 2025

బీట్‌రూట్.. శీతాకాలం బూస్టర్ అని తెలుసా?

image

చలికాలంలో వచ్చే సమస్యలకు బీట్‌రూట్‌తో చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ లేదా ఉడకబెట్టిన బీట్‌రూట్‌ చలికాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, స్కిన్ హెల్త్ సమస్యల పరిష్కారానికి చక్కగా పనిచేస్తుంది.

Similar News

News January 15, 2026

APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) అర్హత గలవారు జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in

News January 15, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఇవే!

image

చిరంజీవి కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. మంగళవారం కంటే బుధవారం వసూళ్లు పెరిగినట్లు Sacnilk తెలిపింది. సోమవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.79.60కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు పేర్కొంది. కాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రూ.120+కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.

News January 15, 2026

₹2 లక్షలు డిస్కౌంట్.. అయినా కొనేవారు లేరు!

image

ఇండియాలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న టెస్లాకు గట్టి షాకే తగిలింది. గతేడాది దిగుమతి చేసుకున్న 300 మోడల్ Y కార్లలో దాదాపు 100 అమ్ముడవక షెడ్డుకే పరిమితమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వారూ ఇప్పుడు వెనక్కి తగ్గుతుండటంతో మస్క్ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఏకంగా ₹2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. భారీ ధరలు, తక్కువ డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.