News April 25, 2024

బీబీపాటిల్‌కు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం..!

image

నామినేషన్ల పర్వం పూర్తవుతున్న నేపథ్యంలో అగ్రనేతల ప్రచారానికి బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీపాటిల్‌కు మద్దతుగా ఆందోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని సుల్తాన్ పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Similar News

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. నిజామాబాద్ ఏ స్థానంలో ఉందంటే?

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 15,547 మంది పరీక్ష రాయగా 8,806 మంది పాసై 56.64 శాతంతో స్టేట్‌లో 25వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 2,562 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,272 మంది విద్యార్థులు పాసై 49.65 శాతంతో స్టేట్‌లో 33వ స్థానంలో ఉంది.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS..NZB ఏస్థానంలో ఉందంటే?

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. NZB(D)లో రెగ్యులర్ విద్యార్థులు 13,879 మంది పరీక్షలు రాయగా 9,187 మంది పాసై 66.19 శాతంతో స్టేట్‌లో 29వ స్థానంలో నిలిచింది ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 2,345 మందికి 1,587 మంది పాసై 67.68 శాతంతో 29వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1,984 మందికి 584 మంది పాసై 29.44%తో 24వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 221 మందికి 88 మంది పాసై 39.82%తో 31th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

NZB: చర్చనీయంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతల వైఖరితో విసిగిపోయి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ​గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్, గతంలో పోచారంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఇక్కడి నేతలు జీవన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు.