News August 23, 2025
బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నాగం

బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా నూతన ఉపాధ్యక్షుడిగా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన నాగం దేవేందర్ ఎన్నికయ్యారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో జిల్లా బీసీ సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, నాగం దేవేందర్ ఎన్నికను ప్రకటించారు.
Similar News
News January 24, 2026
జూన్ లోపు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలి: నారాయణ

అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల పనులను వేగవంతం చేసి, జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు.
News January 24, 2026
త్రివర్ణ శోభితంగా నెల్లూరు కార్పొరేషన్

గణతంత్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు నగరం సిద్ధమవుతోంది. జనవరి 26 పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిసరాల్లో ఇంజినీరింగ్ స్ట్రీట్ లైటింగ్ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యాలయ భవనాలను రంగురంగుల కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. జాతీయ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
News January 24, 2026
నెల్లూరు: బాల్యవివాహాల.. ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

పొదలకూరు మండలం మొగళ్లూరు అంగన్‌వాడీ కేంద్రంలో ECCE డే సందర్భంగా బాల్యవివాహాల నివారణపై ఐసీడీఎస్ సీడీపీవో వి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.18 ఏళ్లు నిండకముందే ఎక్కడైనా పెళ్లిలు జరుగుతుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1098కి కాల్ చేయాలని తెలిపారు.


