News April 25, 2025

బుడగట్లపాలెం : సీఎం చేతుల మీదుగా రూ. 250 కోట్ల పంపిణీ 

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మత్స్యకార భరోసా పథకం కింద 250 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుడగట్లపాలెంలో గురువారం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 26న నిధులు పంపిణీకి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.

Similar News

News March 9, 2026

మగపిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

జిల్లా పోలీసు శాఖ మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పడం కంటే, మగపిల్లలు తప్పు చేయకుండా పెంచడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News March 8, 2026

SKLM: మహిళా సంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్

image

జిల్లాలో మహిళాసంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్ లింకేజీ అందించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత పథకాల అమల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.

News March 8, 2026

శ్రీకాకుళం: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు వేళాయె!

image

మెరుగైన ఇంగ్లిష్ మీడియం విద్యకు చిరునామాగా మారిన ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 మోడల్ స్కూల్స్ ఉండగా, ఒక్క స్కూల్‌లో 100 సీట్లకు ప్రవేశాలుంటాయి. జిల్లాలో 1300 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.