News November 6, 2025

బెదిరింపు కాల్స్ వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ శబరిశ్

image

సైబర్‌ మోసగాళ్ల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. ఇటీవల ములుగులోని ఓ మెడికల్ షాపు యజమానికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌లమని బెదిరించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమానిత వ్యక్తుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News January 15, 2026

అంధుడు అయితేనేమి అందరికీ ఆదర్శం

image

నంద్యాల జిల్లా చాగలమర్రి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సీఆర్ఎంటీగా విధులు నిర్వహిస్తున్న కొండయ్య (అంధ ఉపాధ్యాయుడు) బుధవారం 49వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బాలిరెడ్డి అనే పేషెంట్‌కు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో రక్తదానం చేశారు. తన జీవితంలో 50 సార్లు రక్తదానం చేసి రికార్డు నెలకొల్పాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు కొండయ్య తెలిపారు.

News January 15, 2026

ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన.. ఏర్పాట్ల పరిశీలిన

image

జనవరి 18న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ఆమె పరిశీలించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి ప్రాంతాల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.