News February 19, 2025
బెల్లంపల్లి: ఎస్కార్ట్ నుంచి పారిపోయిన వ్యక్తికి జైలు శిక్ష

పోలీస్ ఎస్కార్ట్ నుంచి పారిపోయిన వ్యక్తికి బెల్లంపల్లి మెజిస్ట్రేట్ J.ముఖేష్ ఒక సంవత్సరం జైలు శిక్ష విధించినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. SHO వివరాల ప్రకారం.. 2024లో నెన్నెల మండలం కోనంపేటకు చెందిన బాపును ఆసిఫాబాద్ సబ్ జైలు నుంచి స్థానిక కోర్టుకు తీసుకువచ్చారు. తిరిగి జైలులో అప్పగించుటకు తీసుకు వెళుతున్న క్రమంలో కాంట ఏరియాలో పారిపోయాడు. కేస్ విచారించిన జడ్జి పైవిధంగా శిక్ష ఖరారు చేశారు.
Similar News
News April 19, 2026
HYDలో భారీ డిమాండ్..!

గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు సృష్టించింది. 2 రోజులుగా అత్యధికంగా 99- 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా మేలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడంతో మార్చి నుంచే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ఇదే సమయంలో ఆర్టిజన్లు సమ్మెకు దిగడంతో నిత్యం కరెంట్ కట్‌లతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడంలేనట్లు తెలుస్తోంది.
News April 19, 2026
మహబూబాబాద్: కాంగ్రెస్‌లో పదవుల కోలాహలం!

కాంగ్రెస్‌లో కమిటీల కసరత్తు జరుగుతోంది. పార్టీలో పదవుల కోలాహలం మొదలైంది. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. కాంగ్రెస్ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులు కావాలంటే కచ్చితంగా కనీసం మూడేళ్లయినా కాంగ్రెస్‌లో సంస్థాగతంగా పనిచేయాల్సిందేనని, అలాంటి వారికే పదవులు ఇవ్వలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన జారీ చేశారు. నాయకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
News April 19, 2026
ప్రశాంతంగా ముగిసిన మక్తల్ ఉప ఎన్నిక

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. అదనపు కలెక్టర్ ఫణీంద్రరెడ్డి పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఈ ఎన్నికలో 89.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి నాగశివ తెలిపారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.


