News March 10, 2025
బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Similar News
News March 22, 2025
టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.
News March 22, 2025
జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నివారణకు చేయవలసిన, చేయకూడని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులకు తెలిపారు. వడగాల్పులకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రణాళికపై అధికారులతో శుక్రవారం ఆయన బాపట్ల కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు జిల్లాలో ఎండ తీవ్రత వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News March 22, 2025
నేడు ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ రాక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నీటి కుంటల పనులను ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.