News November 8, 2025
బెల్లంపల్లి: చెక్ బౌన్స్.. జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా: సీఐ

చెక్ బౌన్స్ కేసులో ఒకరికి జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన నవీన్‌కు తీర్యాణి మండలం గంభీర్రావుపేటకు చెందిన శ్రావణ్ ఇచ్చిన రూ.10లక్షల చెక్ బౌన్స్ అయింది. నవీన్ కేసు వేశారు. నేరం రుజువు కావడంతో శ్రావణ్‌కు జడ్జి సంవత్సరం జైలు శిక్ష రూ.12 లక్షల జరిమానా విధించారు.
Similar News
News January 24, 2026
ప్లాట్‌ల కేటాయింపు వేగవంతం చేశాం: మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్‌ల కేటాయింపు వేగవంతం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 496 ప్లాట్‌లు కేటాయింపు పూర్తయిందని, మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్‌ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. ప్లాట్‌లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
News January 24, 2026
నిజాంసాగర్: నవోదయలో ‘పరీక్ష పే చర్చ’ క్విజ్ పోటీలు

PM మోదీ పిలుపునిచ్చిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ జవహర్ నవోదయలో శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్విజ్ పోటీల్లో JNV ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, TG మోడల్ స్కూల్ ద్వితీయ స్థానంలో, KGVB నిజాంసాగర్ తృతీయ స్థానంలో నిలిచింది.
News January 24, 2026
ఏలూరు: GOOD NEWS .. ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉచిత
ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణపై ఆసక్తి గల వారు apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 08812-234146 నంబర్‌లో సంప్రదించాలన్నారు.


