News February 18, 2025
బెల్లంపల్లి నుంచి నెన్నెలకు పయనమైన పెద్దపులి

బెల్లంపల్లి అటవీ రేంజ్‌లో 15 రోజులుగా సంచరించిన పెద్దపులి కృశ్నపల్లి రేంజ్‌లోకి ప్రవేశించి తాజాగా నీల్వాయి రేంజ్ పరిధి నెన్నెల మండలంలో సంచరిస్తున్నట్లు డిప్యూటీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడించారు. మండలంలోని ఆవిడం గ్రామం పొట్యాల్ అటవీ శివారులో మంగళవారం పులి పాదముద్రలను గుర్తించామన్నారు. కాగా బెల్లంపల్లిలో అడవి పందిని హతమార్చిన పులి ఇప్పటివరకు వేరే జంతువులను చంపిన ఆనవాళ్లు గుర్తించలేదన్నారు.
Similar News
News April 12, 2026
గురుకులాల్లో ఇంటర్ ఫలితాల జోరు.. గతేడాది కంటే మెరుగ్గా ఉత్తీర్ణత!

గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత నమోదైనట్లు ITDA PO బి.రాహుల్ వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 81.76%(గతేడాది 73.83%), ద్వితీయ సంవత్సరంలో 90.44%(గతేడాది 83.86%) ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించడం విశేషం. టాపర్లను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
News April 12, 2026
ATP: రోడ్డు ప్రమాదం.. రుద్రంపల్లి రైతు మృతి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లికి చెందిన రైతు కురుబ మహాలింగ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి తన పొలంలో పండిన చిలగడదుంపలను బొలెరో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, కర్నూలు సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహాలింగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తూ రైతు విగతజీవిగా మారడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
News April 12, 2026
KKRకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి పతిరణ

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవని KKRకు శుభవార్త. స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం నుంచి కోలుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి NOC కూడా సాధించారు. దీంతో అతి త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. ఆయన రాకతో KKR బౌలింగ్ విభాగం బలపడనుంది. కాగా కోల్‌కతా 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.


