News March 27, 2024
బెల్లంపల్లి: రైలు ఢీకొని యువకుడి మృతి

బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మహారాష్ట్రకు చెందిన యువకుడు రమేష్ చిన్న నరోటి(24) మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన రమేష్.. నరోటి ఆహారశుద్ధి పరిశ్రమ పనుల్లో కూలీగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: ADB DSP

ఆదిలాబాద్ మున్సిపల్ ఫలితాల వేళ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాకాయలు పేల్చడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం, ప్రధాన చౌరస్తాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు.
News February 13, 2026
ఆదిలాబాద్‌లో తొలి విజయం మహిళదే

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మొదటి ఫలితం వెలువడింది. 48 వార్డులో బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక ప్రవీణ్ విజయం సాధించారు. తమ సమీప ఏఐఎఫ్‌బీ పార్టీ అభ్యర్థి రంగినేని మనీషాపై 34 ఓట్లతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. మిగిలిన వార్డుల్లో ఫలితాలు వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం నెలకొంది.
News February 13, 2026
ఆదిలాబాద్: ఈనెల 14న స్విమ్మింగ్ పోటీలు

ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈనెల 14వన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారుల వయసు ఆధారంగా గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు విభాగాల వారీగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే వారు 9494945402 నంబర్‌కు సంప్రదించాలన్నారు.


