News September 13, 2025

బెల్లంపల్లి: 9వ తరగతి విద్యార్థిని సూసైడ్

image

బెల్లంపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం తెల్లవారుజామున ఎలుకల మందు సేవించిన ఆమెను కుటుంబీకులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 11, 2025

జగిత్యాల: గురుకుల పాఠశాలాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ గురుకుల చీఫ్ కన్వీనర్ క్రిష్ణ ఆదిత్య ఒకప్రకటనలో తెలిపారు. SC, ST, BC, OC విద్యార్థులు 5, 6, 9వ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియం చదివేందుకు వచ్చే సంవత్సరం జనవరి 21 వరకు రూ.100 రుసుముతో ఆన్లైన్లో దరఖా చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tgswreis.telangana.gov.inలో అప్లై చేసుకోవాలని కోరారు.

News December 11, 2025

ఏలూరు: రైలులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

image

రైలులో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కుటుంబీకుల వివరాల మేరకు..లింగపాలెం(M) కలరాయినిగూడెంనకు చెందిన నాగరాజు (45) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ..20 రోజుల క్రితం పెద్ద తిరుపతిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. రైలులో నిన్న రాత్రి స్వగ్రామానికి బయలదేరి ఏలూరుకు రాగా నాగరాజులో చలనం లేదు. అనంతరం గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదైంది.

News December 11, 2025

జగిత్యాల: పోలింగ్ శాంతియుతం.. కౌంటింగ్‌కు కఠిన భద్రత

image

జగిత్యాల జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు నిర్వహించడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు.