News August 11, 2025
బేగంపేట హైస్కూల్ విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు

జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన రాయపోల్ మండలం బేగంపేట జడ్పీ హైస్కూల్ విద్యార్థులను కలెక్టర్ కె. హైమావతి అభినందించారు. విద్యార్థులు కార్తీక, హర్షవర్ధన్, చైతన్య రూపొందించిన వినూత్న ఆవిష్కరణ “స్మార్ట్ వాకింగ్ స్టిక్” ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ఎగ్జిబిషన్- 2025లో సత్తా చాటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని అన్నారు.
Similar News
News March 13, 2026
ఉస్మానియా తరలింపు వెనక అసలు ప్లాన్ ఇదే!

ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకం కానుంది. అఫ్జల్‌గంజ్‌లోని 26 ఎకరాల భూమిని ‘హెల్త్ టూరిజం’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం లోలోపల కసరత్తు చేస్తోందని సమాచారం. పాత వారసత్వ భవనాన్ని కేవలం మ్యూజియంగా మార్చి, మిగిలిన ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించే ప్రతిపాదన బడ్జెట్ ప్రసంగంలో ‘పరోక్షంగా’ వెల్లడికానుంది.

టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST