News September 11, 2025

బొల్లారం: మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ ఫొక్సో న్యాయమూర్తి జయంతి బుధవారం తీర్పు ఇచ్చారు. బొల్లారంలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి 3 మే 2019న ఆరేళ్ల చిన్నారిని తన భవనం పైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు తీర్పు వెల్లడించారు.

Similar News

News December 11, 2025

గిరిజన సంక్షేమ శాఖలో బాషా పండితులకు తీపి కబురు

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతిపై మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తెలుగు పండిట్స్ 227, హింది పండిట్స్ -91, పీఈటీలు 99.. మెుత్తం 417 మంది గిరిజన శాఖలో స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతులు పొందనున్నారు. సీఎం చంద్రబాబుకి మంత్రి ధన్యవాదములు తెలిపారు.

News December 11, 2025

ఎస్‌ఐఆర్ పూర్తికి సహకరించండి: కర్నూలు ఆర్వో విశ్వనాథ్

image

కర్నూలు అసెంబ్లీలో ఎస్‌ఐఆర్‌ను బూత్ స్థాయిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆర్వో పి.విశ్వనాథ్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ వివరాలు, చిరునామా, ప్రోజనీ సమాచారాన్ని తప్పనిసరిగా బూత్ యాప్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలులో 2,74,803 ఓటర్లలో ఇప్పటివరకు 37,561 మ్యాపింగ్, 15,821 ప్రోజనీ పూర్తి అయ్యాయన్నారు.

News December 11, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్‌ అండ్‌ రన్ కేసులో మరణించిన పెద్దింటి లక్ష్మీనారాయణ భార్య పెద్దింటి రంగమ్మకు రూ.2 లక్షలు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్‌‌ కేసుల్లో 101 మంది బాధితులకు మొత్తం రూ.82లక్షలు అందించినట్లు చెప్పారు.