News September 12, 2025
బోధన్ ఎస్బీఐలో నగదు చోరీ

బోధన్ పట్టణంలోని ఎస్బీఐలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటనారాయణ వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన బ్యాంకుకు వచ్చిన వ్యక్తులు రూ.ఐదు లక్షలు డిపాజిట్ చేసి వెళ్లిపోయారు. తరువాత నగదు క్యాషియర్ వద్ద కనిపించలేదు. దీంతో గురువారం బ్యాంకు సిబ్బంది బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Similar News
News December 17, 2025
నిజామాబాద్ జిల్లా మూడో విడత తొలి ఫలితం

కమ్మర్‌పల్లి మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. రాజ రాజేశ్వరి నగర్ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తైద సుశీల-సాయన్న విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 33 ఓట్లతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
News December 17, 2025
NZB: ఒంటి గంట అప్‌డేట్ 74.36 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, భీమ్‌గల్-73.18%, డొంకేశ్వర్-77.39%, కమ్మర్పల్లి-72.85%, మెండోరా-76.29%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్-78.04%, వేల్పూర్-75.01%, ఏర్గట్ల-75.92% పోలింగ్ నమోదైనట్లు వివరించారు.
News December 17, 2025
నిజామాబాద్ జిల్లాలో 54.69 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ఆలూర్ మండలంలో 56.96%
*ఆర్మూర్ – 56.64 %
*బాల్కొండ – 49.08%
*భీంగల్ -58.68 %
* డొంకేశ్వర్ -56.62 %
*కమ్మర్పల్లి -52.96 %
* మెండోరా -58.14 %
* మోర్తాడ్ -51.48 %
*ముప్కాల్ – 52.77%
*నందిపేట్ – 55.41%
*వేల్పూర్ – 51.48%
*ఏర్గట్ల – 55.45%
పోలింగ్ నమోదైంది.


