News January 13, 2025

బోధన్ పట్టణాన్ని సందర్శించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

image

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ మొట్టమొదటి లోకాయుక్త వెంకట రాములు ఆదివారం బోధన్ పట్టణంలో పర్యటించారు. బోధన్‌లోని శివాలయం, ఎల్లమ్మ ఆలయం, శక్కర్ నగర్‌లోని రామాలయం, ఆచన్ పల్లిలోని మారుతి ఆలయాలను సందర్శించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఆయనతో పాటు బోధన్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 10, 2025

NZB: గత ప్రభుత్వంలో మొద‌లు పెట్టిన ప‌నుల‌ను కొన‌సాగించాలి: కవిత

image

బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కొండ‌గట్టు ఆల‌య అభివృద్ధిని ఆప‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నానన్నారు. బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగించాలని డిమాండ్ చేశారు. కొండ‌గ‌ట్టు రోడ్డు అభివృద్ధి చేయాల‌ని స్థానికులు కోరుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌రమన్నారు.

News February 9, 2025

నవీపేట్: కెమెరాల పని తీరును పరిశీలించిన DIEO

image

రెండో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న నవీపేట్ మోడల్ జూనియర్ కళాశాల, నవోదయ జూనియర్ కళాశాలల్లో కెమెరాల పని తీరును నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 9, 2025

నిజామాబాద్‌లో తగ్గిన చికెన్ అమ్మకాలు

image

నిజామాబాద్ జిల్లాలోని పలు కోళ్ల ఫారాలలో వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో చికెన్ అమ్మకాలు తగ్గాయి. నేడు మార్కెట్‌లో పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు స్కిన్‌‌తో రూ.160, స్కిన్ లెస్‌ రూ.220 వరకు ఉంది. వ్యాధి ప్రభావంతో ప్రజలు చికెన్ కొనేందుకు వెనుకంజ వేస్తున్నట్లు అమ్మకం దారులు తెలిపారు.

error: Content is protected !!