News May 2, 2024

బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన గురువారం జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ డా జి.సృజన కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ తేజతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇచ్చిన సమయం గడువులోగా ముద్రణ ముగించాలని ఆదేశించారు.

Similar News

News December 13, 2025

ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయి: టీజీ వెంకటేశ్

image

నేడు ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం కర్నూలులోని అటల్-మోదీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్నూలు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే మనకు బీజేపీ సహకారం ఎలా ఉందో కర్నూలు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మంత్రి టీజీ భరత్ కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నందున కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.

News December 13, 2025

కర్నూలు జిల్లాలో 8,781 కేసులు నమోదు: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే ఒక నెల జైలుశిక్ష కూడా విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసినట్లు ఆయన చెప్పారు.

News December 13, 2025

నేడు కర్నూలుకు మంత్రి ఆనం రాక

image

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. కర్నూలు నగర శివారులోని అనంతపురం రోడ్డులో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నూతన భవన కార్యాలయాన్ని ఉదయం 11.50 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయ వర్గాలు ఆయన పర్యటన వివరాలను వెల్లడించాయి.