News October 18, 2024
బ్రహ్మసముద్రం: అంగన్వాడీలో చిన్నారులపై కుల వివక్ష

అంగన్వాడీలో చిన్నారుల పట్ల కులవివక్ష చూపించిన ఘటన బ్రహ్మసముద్రం మండలంలో జరిగింది. పడమటి కోడిపల్లి అంగన్వాడీకి సొంత భవనం లేకపోవడంతో ఓ అద్దె ఇంటిలో కేంద్రం ఏర్పాటు చేశారు. కాగా ఇంట్లోకి ఎస్సీ, ఎస్టీ పిల్లలు రావద్దని ఇంటి యజమాని సిబ్బందికి చెప్పారు. దీంతో సిబ్బంది పిల్లలను బయట కూర్చొబెట్టారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా CDPO లక్ష్మీ ప్రసన్న, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News November 6, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.
News November 5, 2025
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, విస్తరించాలని కలెక్టర్ ఆనంద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ స్థాయి వరకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని అన్నారు.
News November 4, 2025
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.


