News November 5, 2025

బ్రాందీ షాపు లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి: ఆవులయ్య

image

ఏలూరు రూరల్ పరిధిలో 3 ఐఎంఎస్‌ఎల్ షాపుల లైసెన్స్ మంజూరు కోసం ఈనెల 10 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. గెజిట్‌లో సీరియల్ నంబర్ 23, 24, 26 షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈనెల 12న ఏలూరు కలెక్టరేట్ గౌతమి కాన్ఫరెన్స్ హాలులో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు.

Similar News

News January 19, 2026

దావోస్‌కు సీఎం.. సింగపూర్ అధ్యక్షుడితో భేటీ

image

AP: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు. అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సమావేశం అయ్యారు. అంతకుముందు జ్యురిచ్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.

News January 19, 2026

మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

image

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్రంలో గడువు పూర్తైన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.