News March 5, 2025

బ్లూఫ్లాగ్ పున‌రుద్ద‌ర‌ణ‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక చ‌ర్య‌లు చేప‌ట్టాలి: కలెక్టర్

image

బ్లూఫ్లాగ్ పునరుద్ధ‌ర‌ణ జ‌రిగేలా రుషికొండ బీచ్‌లో యుద్ధ‌ప్రాతిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. బుధవారం ఆయన రుషికొండ బీచ్‌ను సంద‌ర్శించారు. ప‌రిశ‌స‌రాల్లో క‌లియ‌తిరిగిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌ణించారు. ప‌ర్యాట‌కుల వాహ‌నాల పార్కింగ్ ప‌రిశీలించారు. దుకాణాల స‌ముదాయాలు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు.

Similar News

News December 14, 2025

ఏయూలో రేపటి నుంచి ‘సరస్’ డ్వాక్రా బజార్

image

విశాఖ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో రేపటి (డిసెంబర్ 15) నుంచి 26వ తేదీ వరకు ‘సరస్’ (SARAS) అఖిల భారత డ్వాక్రా బజార్ జరగనుంది. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 600 మంది మహిళలు.. 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.

News December 14, 2025

విశాఖలో ఉత్సాహంగా నేవీ మారథాన్

image

నేవీ డే వేడుకల్లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం ‘నేవీ మారథాన్’ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, నేవీ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ మారథాన్‌లో నగర వాసులు, నేవీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

News December 14, 2025

ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: విశాఖ కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో డిసెంబర్ 15న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.