News November 19, 2025
భక్తులకు అన్ని వసతులు కల్పించాలి: ఆది శ్రీనివాస్

వేములవాడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య, చెల్లించుకుంటున్న మొక్కుల వివరాలను ఆయన ఆరా తీశారు.
Similar News
News January 23, 2026
కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు: బండి సంజయ్

TG: కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఎన్నో అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అయినా ఆ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలున్నా KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
News January 23, 2026
కల్తీనెయ్యి.. ఛార్జిషీట్లో కీలక అంశాలు..

తిరుమలకు 2019-24లో కల్తీనెయ్యి సరఫరా అయినా TTD అడ్డుకోలేదని నెల్లూరు కోర్టులో ఇవాళ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్లో CBI పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా.. తగిన సామర్థ్యం, అనుభవం లేని AR డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. అటు ARకు ఇచ్చినా తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సప్లై చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
News January 23, 2026
ఆదిలాబాద్: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు tsstudycircle.co.in వెబ్‌సైట్ లేదా 9494149416 సంప్రదించవచ్చు. ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


